*
మెట్పల్లి టౌన్, జనవరి 21,
జనంసాక్షి
మెట్పల్లి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని కథలాపూర్ మండలం ఇప్పపల్లి తాండా గ్రామానికి చెందిన గుగులావత్ భీమ్ సింగ్
అనే వ్యక్తి నాటు సారాయి తరలిస్తూ తేదీ 12 మే 2022 రోజున పట్టుబడగా ఒక సంవత్సరం కాలం పాటు కథలాపూర్ ఎమ్మార్వో ముందు ఒక లక్ష రూపాయల కూచికత్తుపై బైండోవర్ చేసినాము కానీ గుగులావత్ బీమ్ సింగ్ తన ధోరణి మార్చుకోకుండా యధావిధిగా నాటుసారయి అమ్ముతూ తేదీ 10 జనవరి 2023 రోజున కేసు నమోదు చేసి, బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కథలాపూర్ మండల మెజిస్ట్రేట్ ఎమ్మార్వో సిహెచ్ శ్రీనివాస్ నిందితునికి ఒక లక్ష రూపాయల జరిమానా విధించగా నిర్ణీత గడువులో జరిమానా రుసుము కట్టనందున ఒక సంవత్సర కాలం పాటు జైలు శిక్ష విధించి జిల్లా కారాగారం కరీంనగర్ కి తేదీ 20 జనవరి 2023 రోజున రిమాండ్ కు తరలించామని ఎక్సైజ్ సీఐ ఎం రాధ మెట్ పల్లి పట్టణంలో తెలిపినారు. మెట్పల్లి ఎక్సైజ్ సర్కిల్ నందు గల మెట్పల్లి,మల్లాపూర్, ఇబ్రహీంపట్నం,కోరుట్ల,మరియు కథలాపూర్ మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా నాటు సారాయి తయారీ , అమ్మకాలు జరిపితే పై విధంగా చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని కావున ప్రజలు అటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరినారు. నాటు సారాయి గురించి ఎటువంటి సమాచారం ఉన్న సెల్ నెంబర్ 9440902708 కి కాల్ చేసి సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు
నాటు సారాయి విక్రయదారునికి ఒక సంవత్సరం జైలు శిక్ష




