Wednesday, 4 November 2026

కడెం ప్రాజెక్టు ను సందర్శించిన డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు

 

దండేపల్లి జనంసాక్షి 17 బారి వర్షాల కారణంగా అతల కుతలం అయిన కడెం ప్రాజెక్ట్ ను డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆదివారం కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించినరు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బారి వరద నుండి కడెం ప్రాజెక్ట్ తెగిపోకుండా ఆగడం చాలా అదృష్టం అని అన్నారు.అప్పటి పాలకులు ప్రాజెక్ట్ ను పటిష్టంగా కట్ట డం దేవుని దయ వల్ల ప్రాజెక్ట్ కట్ట తెగిపోకుండా ఉన్నది అన్నారు. ఎత్తిన ప్రాజెక్ట్ గేట్లు దిగడం లేనందున నీరు గోదావరి నది లోకి పోతున్నాయి. వెంటనే ప్రభుత్వం రిపేర్ చేయించి నీటి నిల్వ చేస్తేనే ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది అని అన్నారు.లేకపోతే సంవత్సరం పంటలు పండే అవకాశం లేదని ఆవేదన చెందారు.ప్రభుత్వం త్వరగా నిధులు మంజూరు చేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని అన్నారు .ఈ కార్యక్రమంలో మంచిర్యాల నిర్మల్ అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.