Thursday, 5 November 2026

హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి – రాజీలేని అభివృద్ధి కొరకు నిర్విరామంగా కృషి – నియోజకవర్గ అభివృద్ధి కోసం అపారమైన నిధులు తెస్తూ జీవో – హుజుర్ నగర్, నెరేడుచెర్ల పట్టణ అభివృద్ధికి పది కోట్ల నిధులు

 

 

 

 

 

 

 

 

 

హుజూర్ నగర్ మే 16 (జనంసాక్షి): హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.హుజూర్ నగర్, నేరేడుచర్ల పట్టణాల అభివృద్ధి కొరకు నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. మంగళవారం టియుఎఫ్ఐడిసినుండి నగరాల మౌలిక సదుపాయాలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం హుజుర్ నగర్, నేరేడుచెర్ల పట్టణాల అభివృద్ధికి 10 కోట్లరూపాయల నిధులు మంజూరు చేయించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తూ, గ్రామాలు పట్టణాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి అపారమైన నిధులు తెస్తూ, రాజీలేని అభివృద్ధి కొరకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.
నిధులు మంజూరు పట్ల పట్టణ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.