కనక సోమేశ్వర కొండ కింద మహా అన్నదానం..
మల్లాపూర్ ఆగస్టు 28(జనం సాక్షి)
మల్లాపూర్ మండల కేంద్రంలో కొలువై ఉన్న అత్యంత ప్రసిద్ధిగాంచిన సోమన్న గుట్ట శ్రావణమాసం రెండవ సోమవారం సందర్భంగా వేలది మంది భక్తులు దర్శించుకున్నారు. కొండ ఎక్కి దిగివచ్చిన భక్తులకు కొండ క్రింద సిఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత చెన్నమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ వారిచే మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ మహా అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన చెన్నమనేని శ్రీనివాసరావు దంపతులకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికి అర్చకులచే ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా చెన్నమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ అత్యంత మహిమగల శివుని కొండ కింద మహా అన్నదాన కార్యక్రమం ఈ శ్రావణమాసంలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందనీ సోమేశ్వర కొండకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని అన్నారు. అనంతరం అన్నదాన దాత చెన్నమనేని శ్రీనివాసరావును శాలువాతో జడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆకుతోట రాజేష్, కోరుట్ల బిజెపి నాయకులు పిసరి అనిల్ కుమార్, దేవాలయ కమిటీ అధ్యక్షులు సంఘ చిన్న రాజన్న,పుప్పల మహేష్, కదుర్గపు నరసయ్య, తోట శ్రీనివాస్, ఖ్యాతం సురేష్ రెడ్డి, బండి లింగస్వామి గౌడ్, ముద్ధం శరత్ గౌడ్, కొమ్ముల జీవన్ రెడ్డి, ధనుష్, పెద్దిరెడ్డి లక్ష్మణ్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు, బోయ నారాయణ, కళ్లెం రవి, రమేష్, శివరాత్రి నరసయ్య, తుక్కారం, రంజిత్, గుజ్జేటి నరసయ్య, మొ రపు జలపతి, వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.