Wednesday, 4 November 2026

కనపర్తిలో గ్రామంలో ఎంపీపీ నిధులతో బోర్వెల్  ను  ప్రారంభించిన ఎంపీపీ  ప్రభుత్వ విప్  ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సహకారంతో  మండల అభివృద్ధికి ముందుకు వెళ్తా .

 

 

 

 

వీణవంక ఏప్రిల్ 7:( జనం సాక్షి)వీణవంక మండలంలోని కనపర్తి గ్రామంలో శుక్రవారం ఎంపీపీ నిధులతో బోర్వెల్ ను ప్రారంభించారు  ఎంపీపీ  ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి. వారు  మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి  సహకారంతో మండలంలో అభివృద్ధి పనులకు ముందుకు వెళ్తా అని ఎంపీపీ మూసి పట్ల రేణుక తిరుపతిరెడ్డి  అన్నారు అనంతరం  ,14 ,15 వ ఆర్థిక సంవత్సర  నిధుల నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రతి గ్రామాల అభివృద్ధిని అధ్యయంగా, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి 80 లక్షల నిధుల నుండి మండలంలో ప్రతి గ్రామంలో  నీటి సదుపాయం, డ్రైనేజ్  నిర్మాణం, లైట్స్ మొదలగు పనులను మండలంలో మొట్టమొదటిగా కనపర్తి గ్రామంలో బోర్వెల్ ప్రారంభించడం జరిగింది. మండలానికి 18 బోర్లు వేయడం జరుగుతుంది. మండలంలో ప్రతి గ్రామాలలో అభివృద్ధి బాటలో  నడిపిస్తున్న సర్పంచ్లకు ఎంపిటిసి లకు   కృతజ్ఞతలు తెలుపుతూ, మన మండలానికి ఉత్తమ అవార్డు కూడా సర్పంచులు ఎంపీటీసీల సహకారంతోనే తీసుకోవడం జరిగింది. ఇకముందు  కూడా మండలానికి నిధులు తీసుకురావడంలో మేము ముందుంటామని, తెలంగాణ రాష్ట్రంలో,   వీణవంక మండలం ముందు ఉండే విధంగా చేస్తానని అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ  సర్పంచ్ పర్లపల్లి రమేష్. ముసిపట్ల తిరుపతి రెడ్డి. మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు కాసం వీరారెడ్డి. గ్రామ ఎంపీటీసీ  మోరే  స్వామి, ఘన్ముకుల ఎంపిటిసి నాగిడి సంజీవరెడ్డి, బండ ముత్తయ్య.చదువు నరసింహా రెడ్డి.ఉప సర్పంచ్  దేవేందర్ రెడ్డి.తదితరులు తో  పాటు తదితరులు  పాల్గొన్నారు.