Wednesday, 4 November 2026

బి ఆర్ ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టు కొమ్మలుప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి

 

 

 

 

 

 

 

ఖానాపూర్ రూరల్ 7 ఏప్రిల్ (జనం సాక్షి): బి ఆర్ ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టు కొమ్మలు అని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ శ్యామ్ నాయక్ అన్నారు.శుక్రవారం తర్ల పాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన బి ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతిపక్షాల అసత్య ప్రచారాల ను బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించి అసత్య ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్షాల కు తిప్పికొట్టాలని ఆమె అన్నారు. తెలంగాణ ఖ్యాతి దేశం దాటింది అంటే అది బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల వల్లే ననీ పార్టీ కార్యకర్తలే బి ఆర్ ఎస్ కు పట్టుకొమ్మలు అని అన్నారు.దేశం లో పలు రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయని,అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పార్టీ శ్రేణులు అందరూ ఐకమత్యంగా పార్టీ ప్రతిష్ఠకు కృషి చేయాలని అన్నారు.బి ఆర్ ఎస్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మహిళలు యువకులు మండలాల కార్యకర్తలు పది గ్రామ పంచాయతీ సర్పంచ్ లు ,ఎంపీ టీసీలు,పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో జన సంద్రంగా మారిపోయింది,కార్యక్రమం అనంతరం మస్కాపూర్, తర్లపాడ్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే రేఖ నాయక్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్,మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్,వైస్ చైర్మన్ గొర్రె గంగాదర్, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజ గంగన్న,పి ఏ సి ఎస్ చైర్మన్ అమంద శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు పుప్పాల గజేందర్,జడ్ పి టి సి వెంక గౌడ్,మాజీ జెడ్ పి టి సి రాథోడ్ రాము నాయక్,టి ఆర్ ఎస్ యూత్ మండల అధ్యక్షులు రామిడి మహేష్,డి ఆర్ బి ఎస్ డైరెక్టర్ కొక్కుల ప్రదీప్,బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కరిపే శ్రీనివాస్,శనిగారపు శ్రావణ్, పాల్గొన్నారు.