కనికాకపూర్ బస చేసిన హోటల్‌లోనే సఫారీ క్రికెటర్లు
కరోనా వ్యాప్తితో క్రికెటర్ల ఆందోళన న్యూఢల్లీి,మార్చి23(జనం సాక్షి ): మూడు మ్యాచ్ వన్డే సిరీస్ కోసం ఇటీవ సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం భారత్, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ను బీసీసీఐ రద్దు చేసింది. ఐతే బాలీవుడ్ సింగర్ కనికాకపూర్ బస చేసిన హోటల్‌లోనే సఫారీ క్రికెటర్లు కూడా బస చేశారు. ండన్ నుంచి భారత్‌కు వచ్చిన కనికా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండకుండా క్నోలోని తాజ్‌హోటల్‌లో నిర్వహించిన పార్టీకి హాజరైంది. గత శుక్రవారం ఆమెకు కోవిడ్`19 పాజిటివ్ ఉన్నట్లు తేడంతో సౌతాఫ్రికా క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 13న రెండు జట్ల ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది మాస్కు ధరించి క్నో చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో కోల్‌కతా నుంచి దుబాయ్ విూదుగా స్వదేశానికి వెళ్లిన సౌతాఫ్రికా టీమ్ అక్కడే క్వారంటైన్‌లోనే ఉంది. ఐతే హోటల్‌లో ఉండగా కనికా ఎవరెవరిని కుసుకున్నది సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పోలీసు చెప్పారు. ఇప్పటికే హోటల్‌ను అధికాయి సీజ్ చేశారు.