Thursday, 5 November 2026

కనుమ రోజున ఇంటి వాకిట్లో ముగ్గులు వేస్తున్న ఎమ్మెల్యే హరిప్రియ

కనుమ రోజున ఇంటి వాకిట్లో ముగ్గులు వేస్తున్న ఎమ్మెల్యే హరిప్రియ

టేకులపల్లి, జనవరి 16( జనం సాక్షి): సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఇల్లందు శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ టేకులపల్లి లోని తన స్వగృహంలో ఎమ్మెల్యేనే స్వయంగా ఎంతో అందంగా రంగు రంగుల ముగ్గులు వేసి ఎమ్మెల్యే వాకిటంతా పరిచారు. సోమవారం కనుమ పండుగ సందర్భంగా టేకులపల్లి లోని దాసు తండా లోని తన స్వగృహం నందు పండుగను వైభవంగా జరుపుకున్నారు. ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులు వేశారు. ముగ్గుల మధ్య గొబ్బెమ్మల ను అలంకరించారు. అనంతరం ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.