జీవో ప్రకారం వేతనాలు ఇవ్వని కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలి పల్లా దేవేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి
కొండమల్లేపల్లి జనవరి 16 జనం సాక్షి న్యూస్
దేవరకొండ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఏఐటియుసి మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటీయుసీ ఆధ్వర్యంలో హాస్పటల్ సూపర్డెంట్ డాక్టర్ ఎన్ రాములు నాయక్ కు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం 12090 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ దేవరకొండలో కాంట్రాక్టర్ కేవలం 7500 రూపాయలు ఇస్తున్నారని ఆరోపించారు. టెండర్ షెడ్యూల్లో కచ్చితంగా జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పినప్పటికీ కాంట్రాక్టర్ కార్మికులకు అన్యాయం చేస్తున్నాడని విమర్శించారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో పోల్చుకుంటే కార్మికులకు వచ్చే జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆ జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా రాష్ట్రంలో కాంట్రాక్టర్లు కార్మికుల పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెరిగిన జీతాలు జీవో ప్రకారం ఇవ్వకపోతే విధులు బహిష్కరించి సమ్మె చేపడతామని దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. కరోణాలో సైతం ప్రాణాలు పనంగా పెట్టి రోగులకు సేవలు అందిస్తున్న కార్మికుల పట్ల కాంట్రాక్టర్ల వైఖరి విడ్డూరంగా ఉందని అన్నారు. తక్షణమే పెంచిన జీతాలు ఇవ్వాలని ఆయన కాంట్రాక్టర్ ను కోరారు . ఈ కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గొల్లూరి ఆంజనేయులు కార్యదర్శి ఏ రామేశ్వరమ్మ, ప్రణయ్, తారమ్మ, కాశయ్య, భద్రమ్మ ,లచ్చిరాం, బుజ్జి, రాణి,జానకి, అరుణ లింగమ్మ, జ్యోతి, కవిత,సరిత, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జీవో ప్రకారం వేతనాలు ఇవ్వని కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలి




