Thursday, 5 November 2026

కనుల పండుగగా మహా పడిపూజ

కనుల పండుగగా మహా పడిపూజ

ఘట్కేసర్ డిసెంబర్ 15జనం సాక్షి ఘట్కేసర్ మండల పరిధిలోని పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప లో మొగిలి వీరేందర్ కన్నె స్వామి ఇంటిలో సంజయ్ కుమార్ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ అంగరంగ వైభవంగా జరిగింది. గురు స్వామి పడిపూజ మహోత్సవంలో శ్రీ స్వామివారి అంగపూజ, అష్టోత్తరము, సహస్రనామార్చనతో, పంచామృత అభిషేకాలతో కనుల పండుగ మహా పడిపూజ నిర్వహించారు. పూజకు వచ్చిన స్వాములు భక్తులు తన్మయత్వంతో పరవశించిపోయారు. అభిషేకం అనంతరం స్వామివారిని అందంగా అలంకరించిన శ్రీ స్వామి వారి దివ్య మంగళ స్వరూపం చూడడానికి రెండు కళ్ళు చాలవు అన్నట్లుగా ఉద్వీకానికి లోనయ్యారు. ఈ సందర్భంగా గురు స్వామి మాట్లాడుతూ కలియుగంలో ఏ దీక్షకు లేనటువంటి విధంగా శ్రీ అయ్యప్ప స్వామి దీక్షలో మనిషిని దేవుడిగా కొలిచే సాంప్రదాయం ఉన్నది అని మామూలు మనిషి శ్రీ స్వామివారి మాల వేసుకోగానే సాక్షాత్తు శ్రీ అయ్యప్ప స్వామి స్వరూపంగా కొలుస్తూ పేరు ప్రక్కన స్వామి అనే నామంతో పిలువబడుతున్నారంటే ఈ దీక్షకు పవిత్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలని అన్నారు. మాల ధరించే ప్రతి స్వామి కూడా నియమాలు క్రమం తప్పకుండా పాటించాలని స్వామి అనే పిలుపునకు సార్ధకత చేకూర్చాలని అలా అయితేనే శ్రీ స్వామివారి దీక్ష తీసుకోవాలని అలాకాకుండా మన ఇష్టానుసారం చేసేటట్లయితే దీక్ష తీసుకోవద్దని దీక్షకు ఉన్న పవిత్రతను కాపాడవలసిన బాధ్యత మాల వేసిన ప్రతి స్వామీ పైన ఉందని గురుస్వామి తెలియజేశారు. పడి పూజ చేసిన స్వామి మొగిలి వీరేందర్ స్వామి మాట్లాడుతూ కనుల పండుగగా భక్తి భావంతో ఈ పడిపూజను చేయించినందుకు కార్యక్రమం నిర్వహించినందుకు గురు స్వామికి, పూజా కార్యక్రమం కొచ్చిన స్వాములందరికీ వేల వేల పాదాభివందనాలు చేస్తున్నాను అని అన్నారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ పడిపూజ కార్యక్రమంలో విజయ్ గురుస్వామి సన్నిధానం గురు స్వాములు గడ్డం సతీష్ యాదవ్, కుమార్ చారి, సుమన్ స్వామి కార్తీక్ స్వామి ,గదా స్వాములు ఆంజనేయులు స్వామి శేఖర్ స్వామి, గంటస్వాములు సతీష్ స్వామి నాగరాజు స్వామి కత్తి స్వాములు సంజీవ స్వామి అభిలాష్ స్వామి, కన్నె స్వాములు జితేందర్ స్వామి నవీన్ స్వామి, కాలనీ స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు.