గాయపడిన గీత కార్మికుడికి ప్రభుత్వ ఎక్సగ్రేషియా అందించాలి.
జనం సాక్షి, డిసెంబర్ 15,భువనగిరి న్యూస్ ;
యాదాద్రి భువనగిరి జిల్లా మోట కొండూరు మండలం వర్టూర్ గ్రామంలో గీత కార్మికుడు ఇతగాని వెంకటేష్ గౌడ్ ఈరోజు వృత్తి లో బాగంగా తాటి చెట్టు ఎక్కి గోల గీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి కాలు.చెయ్యి విరిగి తీవ్ర గాయాలతో సుప్రజా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఇతనికి ప్రభుత్వం పరంగా ఎక్స్గ్రేషియా అందించవలసిందిగా కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున కేజీ కేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగానీ జయరాములు. మండల అధ్యక్షుడు బొడిగ బిక్షపతి. ప్రధాన కార్యదర్శి కోల కృష్ణ. వర్టుర్ గౌడ సంఘం అధ్యక్షులు సూదగాని రాందాస్ తదితరులు ప్రభుత్వ ఎక్సైజ్ అధికారులను కోరారు




