నెరడిగొండఏప్రిల్8(జనంసాక్షి):మండలంలోని వాంకిడి గ్రామానికి చెందిన షేక్ ఫజల్ పదవ తరగతి చదవి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పది పరీక్షలు రాస్తుండగా వారి కన్నతల్లి అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు.మాతృమూర్తి మరణం కుటుంబీకులకు తీరని లోటు తల్లి మృతి చెందిన బాధలో కన్నీరు మున్నీరైన రెండో కుమారుడు షేక్ ఫజల్ పదవ తరగతి విద్యార్థి ఏమిచేయలేని పరిస్థితిలో శనివారం రోజు ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి గణిత శాస్త్రం పరీక్షకు మండలంలోని లఖంపూర్ ఆశ్రమ బాలికల పాఠశాల పరీక్ష కేంద్రంలో దుఃఖాన్ని దిగమించుకుని హాజరయ్యారు.కన్నతల్లి మృతదేహానికి వదలి బాధ దుఃఖాన్ని భరించి పరీక్ష రాసిన విద్యార్థిని చూసి బాధిత కుటుంబాలు గ్రామస్తులు బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.పరీక్ష రాసేసి తల్లి అంత్యక్రియలకు హాజరయ్యారు.




