జుక్కల్, ఎప్రిల్ 9, (జనం సాక్షి),కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ఆదివారం బాన్స్ వాడ డిఎస్పీ జగన్నాథ రెడ్డి అద్వర్యంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిఎస్పి పవన్ కుమార్ రావత్ 60మంది జవాన్లతో ప్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ ప్లాగ్ మార్చ్ గాంధి చౌక్, రతన్ గల్లి, ఎల్లమ్మ గల్లి, మార్వాడి గల్లీ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది.ఈ సంధర్భంగా బాన్స్ వాడ డిఎస్పీ జగన్నాథ రెడ్డి మాట్లాడుతు వివిధ వర్గాల మధ్య అల్లర్లు నివారించడానికి కేంద్ర బలగాలతో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఖలీద్, బిచ్కుంద సీఐ కృష్ణ ,మద్నూర్ ఎస్సై కృష్ణారెడ్డి , పెద్దకొడప్ గల్ ఎస్సై కోనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




