కన్నయ్య సభలో గందరగోళం

మహారాష్ట్రలోని నాగపూర్‌ లో జె.ఎన్.యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ సభలో గందరగోళం చేలరేగింది. అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కన్నయ్యపై చెప్పు, రాళ్లు విసిరేందుకు యత్నించాడు ఓ విద్యార్థి. దాంతో విద్యార్థిని అడ్డుకున్న కన్నయ్య మద్దతుదారులు చితకబాదారు. మరోవైపు, కన్నయ్య ముర్దాబాద్ అంటూ కొందరు నినాదాలు చేశారు. సమావేశం నుంచి వారిని బయటకు పంపించి వేశారు.