–
ఆర్ అండ్ బి మంత్రికి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల గ్రామం (బోడగుట్టపల్లి )వద్ద ఉన్న రాజీవ్ రహదారి నుండి రైల్వే ట్రాక్ పై నుండి రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణనికి నిధులు మంజూరు చేయాలని మంథని ఎమ్మెల్యే దుద్దుల శ్రీధర్ బాబు రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని కోరారు. అలాగే (మంథని)భట్టుపల్లి వద్ద నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం వరకు దాదాపు 25 కిలోమీటర్ల వరకు రోడ్డు పూర్తిగా గుంతలతో ధంసమైపోయిందని, డ్రైనేజ్ నిర్మాణనముతో పాటు బి.టి రోడ్డు మంజూరుకు నిధులు కేటాయించి ఆధునక పద్దతులను ఉపయోగించి త్వరితగతిన పూర్తి చేయలని మంత్రిని హైదరాబాద్ లో అసెంబ్లీ కలిసి వినతి పత్రం ద్వారా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కోరారు. మంథని నియోజకవర్గంలోని పెద్దపెల్లి జిల్లాకు సంబంధించిన పాలకుర్తి మండలం లో గల కన్నాల గ్రామం (బోడగుట్టపల్లి ) వద్ద ఉన్న రైల్వే ట్రాక్ నుండి రాఘవ పూర్ రైల్వే స్టేషన్ మీదుగా చాలా ప్రతి నిత్యము రైలులు వెళ్ళడం వల్ల ప్రతి 5 నుండి 10 నిమిషలకు రైల్వే గేట్లు పడుతుండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కన్నాల గ్రామంలో దాదాపుగా 3000 మంది ప్రజలే కాకుండా ఆ గ్రామము మీదుగా ఇతర గ్రామలైన రాణాపూర్, జీడి నగర్, ఏలూకాల పల్లి,బామ్లాల తండా,గుంటూరు పల్లి, మిగిలి చాలా గ్రామలైనలన గేటు పడటం వల్ల అత్యవసర సమయాలలో ఇతర ప్రదేశాలకు వెళ్లేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ రైల్వే గేట్ పై రోడ్డు అండర్ బ్రిడ్జి బ్రిడ్జి నిర్మాణం నిధులు మంజూరు చేయగలరని కోరారు. (మంథని) భట్టుపల్లి నుండి కాటారం వరకు సంబంధించిన రోడ్లు పూర్తిగా మా నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక రవాణా ద్వారా పూర్తిగా రోడ్లు క్రుంగి పోయి పూర్తి స్థాయిలో పెద్ద గుంతలుగా ప్రమాద భరితంగా తయారయినాయి. అధిక లోడుతో ఇసుక రవాణాకు వేల కొద్ది లారీలతో మా నియోజకవర్గం నుండి హైదరాబాద్, తదితర ప్రాంతాలకు తీసుకపోవడం వలన పూర్తిగా రోడ్లు ద్వంసమై ప్రమాద భరితం గా మారాయని వెంటనే నిధులు మంజూరు చేసి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని శ్రీధర్ బాబు కోరారు.




