దంపతులు – అత్యంత వైభవంగా లింగమంతుడి జాతర – భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు హుజూర్ నగర్ ఫిబ్రవరి 6 (జనంసాక్షి): మండలంలోని అమరవరం గ్రామంలో చిన్న గట్టు జాతర సందర్భంగా సతీసమేతంగా లింగామంతుల స్వామిని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపుడి సైదిరెడ్డిరజిత దంపతులు స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం కోలాటం పోటీలను ప్రారంభించారు. సోమవారం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూఅమరవరం గట్టు జాతర అంటేనే చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఇదో పెద్ద జాతరని, ఎంతో ప్రతిష్టాత్మకంగా లింగమంతుల స్వామి జాతరను నిర్వహించడం జరుగుతుంది. గతం కంటే ప్రస్తుతం ఏర్పాట్లు ఎక్కువగా చేశామని, హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరి పై లింగమంతుల స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను సమ దృష్టితో చూస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని, ఆ లింగమంతుల స్వామి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. భారతదేశాన్ని సరైన రీతిలో నడిపించే ఏకైక నాయకుడు ఆయనేనని అన్నారు. గట్టుపైకి భారీగా చేరుకున్న యాదవ సోదరులు, భక్తులు బారులు తీరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, స్థానిక సర్పంచ్ గుజ్జుల సుజాతఅంజిరెడ్డి, కుందూరు భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, సోమగాని ప్రదీప్, అలీ, గుడి చైర్మన్ అమరబోయిన మట్టయ్య, వైస్ చైర్మన్ మద్దుల లింగరాజు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




