Tuesday, 3 November 2026

పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామ సర్పంచుల సంఘం

 

 

 

 

 

 

 

 

 

జనం సాక్షి:కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి 6ఉపాధ్యక్షుడు తిరుపాటి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దళిత బంధుకు కేటాయించిన 17,700 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది.దళితబంధు సాయం వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేస్తుంది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నది దళిత వర్గాల జీవితాలను దళితబంధు పథకం పెద్దఎత్తున మార్పు తీసుకొస్తోందని.ఇది దళిత వర్గాలకు మేలుకొలుపు వంటిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే దళిత బంధు కార్యక్రమం అమలు జరుగుతోందన్నారు. మల్లేశ్వరం గ్రామ సర్పంచ్ తిరుపాటి నాగరాజు