Tuesday, 3 November 2026

కన్నీరు పెడుతున్న రైతులు… పత్త జాడ లేని ప్రభుత్వం బెజడి

బచ్చన్నపేట మే 30 (జనం సాక్షి) జనగామ జిల్లాలో గత కొన్ని రోజుల క్రితం వడగండ్ల వానలతో వరి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పచ్చ జడ లేకుండా పోయిందని . బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యక్షులు బేజా డి బీరప్ప అన్నారు. మంగళవారం బచ్చన్నపేట బిజెపి మండల అధ్యక్షులు సద్ది సోమిరెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ.జనగామ జిల్లాలో బచన్న పేట మండలంలో 14 వేల ఎకరాల పైన అకాల వర్షాల వల్ల వడగండ్ల వాన వల్ల పంట నష్టం జరిగి రైతు కుటుంబాలన్నీ కన్నీరు సమస్యల వలయంలో చిక్కుకొని రోధిస్తుంటే ఈ నియోజకవర్గ శాసన సభ్యుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతిరోజు ఆత్మీయ సమ్మేళనాల పేర్లతో మందు తాగుతూ ముక్కలు తింటూ చిందులు వేస్తున్న వైనాన్ని బచ్చన్నపేట ప్రజలు గమనిస్తున్నారని.రైతుల మీద ప్రేమ లేని పార్టీ బిఆర్ఎస్ పార్టీ పంట నష్టం భీమా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్లనే ఈరోజు రైతులకు ఈ గతి పట్టిన విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.పంట నష్టం జరిగి రెండు నెలలు అవుతున్న పంట నష్టపరిహారాన్ని ప్రకటించి కూడా ఇప్పటివరకు చెల్లించకపోవడం బాధాకరమని. ఈ బీఆర్ఎస్ పార్టీ రైతు పక్షపాతి కాదు రైతులను రాక్షసుల రూపంలో వారి రక్త మాంసాలను పిక్కతింటున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని గడిచిన నాలుగు సంవత్సరాల నుండి రైతు రుణమాఫీ చేయకుండా రైతులనకు కొత్త రుణాలు రాకుండా ఇబ్బంది పెడుతున్న పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వీధి వీధినా పల్లె పల్లెనా పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు తీసుకువచ్చి మద్యాన్ని ఏరులై పారిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టిఐ అప్లికేషన్లకు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవు అని చెప్పి ప్రజలను మోసం చేస్తుందని. ఈరోజు గ్రామ గ్రామాన పల్లె పల్లెన గంజాయి డ్రగ్స్ లాంటి వాతావరణాన్ని తీసుకువచ్చి విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెడుతున్న పార్టీ టిఆర్ఎస్ అన్నారు.
రైతుబంధు పేరు చెబుతూ రైతులకు రావాల్సిన ఇన్ పుట్ సబ్సిడీలు ఇవ్వకుండా సబ్సిడీలతో విత్తనాలను పంపిణీ చేయకుండా పంటకు మద్దతు ధర బోనస్ ప్రకటించకుండా పంట నష్ట భీమా అమలు చేయకుండా రైతులకు కొత్త రుణాలు కల్పించకుండా రైతులను అన్ని విధాలుగా నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్న పార్టీ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ అని
మండల హెడ్ క్వార్టర్స్ లలో జనగామ టౌన్ లో జిల్లాలో ఈరోజు సరైన వైద్య సౌకర్యాలు లేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్న విధానాన్ని అను నిత్యం మనం మీడియాలో సోషల్ మీడియాలో చూస్తున్నాం ప్రజలకు అందాల్సిన మౌలిక సదుపాయాలు అందనివ్వకుండా విద్యార్థులకు విద్యను దూరం చేసి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను దూరం చేసి పరిశ్రమల నిర్మాణం జరగకుండా ఈరోజు డబ్బా కొట్టుకుంటూ పాలాభిషేకాలకు మాత్రమే పరిమితమైన శాసనసభ్యుడు అసమర్ధ శాసనసభ్యుడు జనగామ నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు అని విమర్శించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ గారు, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు అఫ్జల్ గారు, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ నవీన్ గారు, బీజేవైఎం మండల అధ్యక్షులు బంగారు మహేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మల్లారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దొంతుల చంద్రమౌళి, దబ్బగుంటపల్లి సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు పోతుల వెంకటేష్, బుత్ అధ్యక్షులు జలంధర్, భాస్కర్, సీనియర్ నాయకులు గూడెపు కనకయ్య , రావుల శ్రీకాంత్ రెడ్డి, మరియు జిల్లా మండల నాయకులు పాల్గొనడం జరిగింది,