బై0సా.రూరల్ మే30 జనం సాక్షిమాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే కేసీఆర్ మాటలు ప్రజలు ఇకపై నమ్మొద్దని భాజపా అదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమన్న అన్నారు.
మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రా భాజపా పార్టీ పిలుపుమేరకు మంగళ వారం బైంసా పట్టణంలోని స్థానిక ఎస్.ఎస్ ఫ్యాక్టరీలో బైంసా మండల భాజపా కార్యకర్తల కార్యవర్గ సమావేశం నిర్వహి0చారు.ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు… రాబోయే రోజుల్లో ముధోల్ నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కార్యకర్తలందరు ఐక్యమత్యంగా పనిచేయాలని తెలిపారు. అనంతరం ముధోల్ తాలూకా భాజపా నాయకులు పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ…. నీళ్లు, నిధులు,నియమకాలు అంటూ కేసిఆర్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజల్ని మోసం చేసిందంటూ… ఇకనైనా ప్రజలు మోసపూరిత మాటలు వినకుండా అభివృద్ధి పథంలో నడిపించాలనుకునే బిజెపికి ప్రజలు అభివాదం తెలియజేయాలని, మచ్చలేని నాయకుడిగా ఎదిగినటువంటి మోడీ పాలనలో దేశంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యాయని,ప్రతి భాజపా కార్యకర్త కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిపి, వివరించి, సంబంధిత పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందేలా చూడాలని సూచించారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేయడానికి ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ రావుల రామనాథ్, ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ కో కన్వీనర్ మయూరి చంద్ర, శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నగర్ నారాయణ రెడ్డి ,రవి పాండే, బి.గంగాధర్, గోపాల్,తూమోళ్ళ దత్తు, మరియు పలువురు బైంసా మండల సర్పంచులు ,జడ్పిటిసిలు ఎంపీటీసీలు ,కార్యకర్తలు పాల్గొన్నారు.




