Thursday, 5 November 2026

గుమ్మడిదలలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి

 

 

 

 

 

 

 

 

 

జిన్నారం మే 12( జనంసాక్షి)సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రంలోని టోల్గేట్ ప్రాంతంలో నిన్న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో గుమ్మడిదల గ్రామానికి చెందిన వినోద్ కుమార్(22) సంవత్సరములు టి.స్35సి(6358) తన ద్విచక్ర వాహనమైనటువంటి పల్సర్ పై నుండి అదుపుతప్పి టోల్గేట్ ప్రధాన రహదారిపై డివైడర్ కు ఢీకొని కింద పడిపోయినాడు! ఈ సమాచారం తెలుసుకున్న టోల్గేట్ యొక్క అత్యవసర వాహనం పిలిపించి సూరారం లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినారు. రాత్రి చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మృతి చెందారని గుమ్మడిదల ఎస్సై విజయ్ కృష్ణకు సమాచారం అందించారు!! అయితే మృతిని తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు గుమ్మడిదల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.