మనుస్మృతిని రాజ్యాంగంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి కుట్రలను తిప్పికొడదాం.
– సిపిఐ బెల్లంపల్లి నియోజవర్గ ఇంచార్జ్ రేగుంట చంద్రశేఖర్.
బెల్లంపల్లి, నవంబర్25, (జనంసాక్షి )
మనుస్మృతిని రాజ్యాంగంగా మార్చడానికి బీజేపీ పార్టీ చేస్తున్న కుట్రలను తిప్పి కొడదాం అని సిపిఐ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జి రేగుంట చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా ఆయన సిపిఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి కాంటా చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుస్మృతిని రాజ్యాంగంగా మార్చేందుకు బిజెపి కుట్రను తిప్పికొడదామని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 73 సంవత్సరాలు పూర్తయిందని, స్వాతంత్య్రోద్యమం సమయంలో రాజ్యాంగం ఆవశ్యకతను నొక్కిచెబుతూ తొలిసారిగా 1934లో ప్రముఖ కమ్యూనిస్టు ఎంఎన్ రాయ్ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని అన్నారు. అత్యంత పరిపుష్ట రాజ్యాంగం రూపొందించుకునేందుకు వివిధ దేశాలకు చెందిన రాజ్యాంగాలను ఈ కమిటీ అమూలాగ్రం నిశితంగా పరిశీలించింది. అనేక చర్చోపచర్చల మీదట 2 సంవత్సరాల 11 మాసాల 18 రోజుల కసరత్తు అనంతరం రూపొందించిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 న ఆమోదించారన్నారు. భారత రాజ్యాంగాన్ని విషతుల్యమైన రాజ్యాంగంగా వీర సావర్కర్ అభివర్ణించారని తెలిపారు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి పేరుతో భారతదేశ బహుళత్వాన్ని బిజెపి ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తున్నదని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు చిప్ప నర్సయ్య, బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి డి ఆర్ శ్రీధర్, పట్టణ సహాయ కార్యదర్శి బియ్యాల ఉపేందర్, మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ, జిల్లా సమితి సభ్యులు ఆడెపు రాజమౌళి, గుండా మాణిక్యం, రంగ ప్రశాంత్, ఎత్తూరి శంకర్, లింగాల అమృత, మేకల రాజేశం, బండారి శంకర్, గుండ ప్రశాంత్, సింగరపు భరత్, తోంగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు




