కమలా సాహూ జాతీయ అవార్డు గ్రహీత మాదిరెడ్డి సంధ్యారెడ్డి గారికి నల్లగొండలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం కొండమల్లేపల్లి నవంబర్ 20 జనం సాక్షి న్యూస్ : దేవరకొండ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎంతో మంది వృద్ధ మాతలకు తమ విలువైన విశిష్ట సేవలు అందించినందుకు, కరోనా విస్తృత సమయంలో కూడా వృద్ధ మాతలకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ, వృద్దమాతలకు 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ, వృద్ధ మాతలకు సేవతోపాటు మహిళా మణులందరికీ మహిళా మండలి ద్వారా మహిళలకు సంబంధించిన ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారు వృద్ధాశ్రమంలో ప్రతిరోజు వృద్ధమాతలకు ధైర్యాన్ని నింపుతూ సంతోషంగా జీవితం గడిపేలా వివిధ కార్యక్రమాలు చేపట్టారు దేవరకొండ పట్టణంతోపాటు పరిసర ప్రాంతాలలో వృద్ధ మాతలకు, మహిళలకు, యువతులకు సంబంధించిన సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు రాజకీయాలకు అతీతంగా సమాజ సేవ చేస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అందరి ప్రశంసలు అభిమానాలు పొందారు విజయవంతమైన మహిళగా సఫలీకృతమైన మహిళగా సమాజంలోని ఎందరో మహిళలకు భరోసాగా నిలిచి నాటి తరం నుండి నేటి తరం వరకు నేనున్నానంటూ వృద్ద మాత సేవలో తరిస్తూ వారు మహిళా లోకానికి చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ జాతీయ స్థాయిలో కమలా సాహూ ఉత్తమ సోషల్ సర్వీస్ అవార్డును జాతీయస్థాయి అవార్డును కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో ఉత్తమ జాతీయ అవార్డు తీసుకున్నారు ఉత్తమ జాతీయ అవార్డు స్వీకరించిన (ఉక్కుమనిషి) మాదిరెడ్డి సంధ్యారెడ్డి గారికి నల్లగొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ మీటింగ్ లో ఇంద్రధనస్సు కార్తీక వనభోజనాలు మరియు సన్మాన కార్యక్రమం చేశారు దాదాపు నలుగురు లయన్స్ క్లబ్ గవర్నర్లు కలిసి ఘన సన్మానం చేశారు
కమలా సాహూ జాతీయ అవార్డు గ్రహీత మాదిరెడ్డి




