Thursday, 5 November 2026

మాజీ సైనికుల కుటుంబాల కోసం అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు

మాజీ సైనికుల కుటుంబాల కోసం అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు

– ఔట్ రీచ్ కార్య‌క్ర‌మంలో బ్రిగేడియ‌ర్ సోమ‌శంక‌ర్

హ‌న్మ‌కొండ‌ బ్యూరో నవంబర్ 20జనంసాక్షి

మాజీ సైనికుల సంక్షేమార్థం కేంద్ర ప్ర‌భుత్వం అందుబాటులో ఉంచిన ప‌లు సంక్షేమాల‌ను వారి కుటుంబ స‌భ్యులు వినియోగించుకోవాల‌ని తెలంగాణ‌, ఆంధ్ర స‌బ్ రీజియ‌న్ అఫిసియేటింగ్ జ‌న‌ర‌ల్ ఆఫీస‌ర్ క‌మాండింగ్ బ్రిగేడియ‌ర్ సోమ‌శంక‌ర్ సూచించారు. స్ప‌ర్శ్ వెబ్‌సైట్ ద్వారా వీటిని పొందాల‌ని ఆయ‌న కోరారు. కేయూ ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో ఆదివారం నిర్వ‌హించిన ఔట్ రీచ్ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోమ‌శంక‌ర్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ వీర మ‌ర‌ణం పొందిన‌, ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన సైనికుల కుటుంబాల కోసం అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లులో ఉన్నాయ‌ని తెలిపారు. వీటిని స‌ద్వినియోగం చేసుకునేందుకు స్ప‌ర్శ్ పోర్ట‌ల్‌పై ప్ర‌తి ఒక్క‌రూ అవ‌గాహ‌న పొంది ఉండాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా వివిధ ప‌థ‌కాల గురించి ఆయ‌న వివ‌రించారు. అనంత‌రం సైనికుల కుటుంబ స‌భ్యుల స‌మ‌స్య‌ల గురించి క‌మాండెంట్ సోమ‌శంక‌ర్ అడిగి తెలుసుకున్నారు. వాటి ప‌రిష్కారం త‌మ వంతు కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు.