జనంసాక్షి, కమాన్ పూర్ కమాన్‌పూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ ఏర్పాటు కోసం స్థలం కెటాయింప చేయాలని జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేయాలని కమాన్‌పూర్ మార్కెట్ కమిటి పాలక వర్గం శుక్రవారం పాలక వర్గం సమీక్ష సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. కమాన్‌పూర్
మార్కెట్ కమిటి ఏర్పాటైనప్పటికి ఇక్కడ యార్డ్ లేకపోవడంతో కేవలం అద్దె భవనంలోనే మార్కెట్ కమిటి కొనసాగుతు వస్తుందని, త్వరలో యార్డ్ స్థల కెటాయింపుతో పాటు యార్డ్ సముదాయం భవన నిర్మాణాలు చేపట్టాలని పాలక వర్గం నిర్ణయించింది. ఇందుకోసం పాలక వర్గంతో కలిసి జల్లా కలెక్టర్కుఇక్కడికి సంబంధించిన స్థల సమస్య గురించి వివరించి ప్రభుత్వ స్థలం కేటాయించే విధంగా సానుకూల నిర్ణయం పొందాలని నిర్ణయించారు. అలాగేగిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు సాయి చందు ఇటీవల మృతి చెందగా అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సి చైర్మన్ దాసరి రాజలింగు, వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మిమల్లు, పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్‌రావు, సెక్రెటరీ ఈర్లసురేందర్, డైరెక్టర్లు పెండ్లి నారాయణ, రాజు, అశోక్, చంద్రమొగిళి, ఓదెలు, సంపత్ అనవేన వేణు, రమేష్, మైదం స్వప్న, లింగారెడ్డి, మురళీ, నీలం
తదితరులు పాల్గొన్నారు.
కమాన్‌పూర్ మార్కెట్ యార్డ్ స్థల కెటాయింపు కోసం ఏకగ్రీవ తీర్మానం




