Monday, 2 November 2026

మానవత్వాన్ని చాటిన మంత్రి కొప్పుల

ధర్మపురి (జనం సాక్షి )ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామానికి చెందిన జక్కి శ్రీనివాస్ బుధవారం ట్రాక్టర్ ట్రాలీ నడుపుతు ప్రామాదవశాత్తూ ట్రాలీ క్రింది పడి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు, వారిది నిరుపేద కుటుంబం రెక్కాడితే డొక్కాడని పరిస్థితి, ఈ విషయాన్ని స్థానిక నాయకులు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించగా ఆ మృతదేహాన్ని స్వంత గ్రామానికి చేర్చుటకు ఎల్.యం కొప్పుల సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా 2 వేల రూపాయల ఆర్థిక సహాయంతో అంబులెన్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది..