Wednesday, 4 November 2026

కమాన్ పూర్ డిప్యూటీ తహసిల్దారుగా కోటేశ్వర్

జనంసాక్షి , కమాన్ పూర్, అక్టోబర్10 : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల డిప్యూటీ తహసీల్దారుగా సుదాడి కోటేశ్వరరావు మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. సుల్తానాబాద్ లో సీనియర్ అసిస్టెంట్ గా పని చేసిన కోటేశ్వరరావు డీటీగా పదోన్నతి పొంది కమాన్ పూర్ కు వచ్చి తహసిల్దార్ వంగమోహన్ రెడ్డి వద్ద జైనింగ్ రిపోర్ట్ చేశారు. కోటేశ్వర్ గతంలో కమాన్ పూర్ మంథని ముత్తారం తహసీల్ కార్యాలయాల్లో గిదవారిగా చేశారు. ప్రస్తుతం పదోన్నతిలో కమాన్ పూర్ కు రాగా తహసిల్దార్ వంగ మోహన్ రెడ్డి మండల గిర్ధవర్లు సందాని, రవీందర్, జూనియర్ అసిస్టెంట్ మాల్క రెడ్డి, రాజేందర్, ధరణి ఆపరేటర్ నగేష్, ఆపరేటర్ తోట రమేష్, అటెండర్ లింగయ్య తదితరులు పూల బోకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.