కొల్లాపూర్ లో టీఎన్జీవో ఉద్యోగస్తుల సమస్యలపై డివిజన్ యూనిట్ సమావేశం

కొల్లాపూర్ నియోజక వర్గం అక్టోబర్10( జనం సాక్షి) కొల్లాపూర్ పట్టణంలో టీఎన్జీవో భవనంలో మంగళవారం కొల్లాపూర్TNGO డివిజన్ యూనిట్ సమావేశం టీఎన్జీవో అధ్యక్షులు జి. కె. వెంకటేష్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా టిఎన్జీవో డివిజన్ యూనిటీ వ్యక్తులు జీకే వెంకటేష్ మాట్లాడుతూముఖ్యంగావివిశాఖలలోఉన్నఉద్యోగుల ప్రాథమిక సభ్యత్వం నమోదు త్వరితగతిన పూర్తి చేయాలని , యూనిట్ బిల్డింగ్ అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి యూనిట్ బిల్డింగ్ కు తన వంతు సహకారం అందిస్తానని గతంలో హామీ ఇవ్వడం జరిగింది.దానికిసంబంధించినటువంటియాక్షన్ప్లాన్ ,ఎస్టిమేషన్ కూడా పూర్తి చేసి మళ్లీ ఎమ్మెల్యే గారిని కలవాలని కమిటీ తీర్మానం చేసినది. మరియు వివిధ శాఖలో ఉన్న ఉద్యోగుల యొక్క సమస్యల గురించి చర్చించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నాగర్కర్నూల్ జిల్లా టీఎన్జీవో సహ అధ్యక్షులు పసుల సత్యనారాయణ యాదవ్, నాగర్ కర్నూల్ జిల్లా పంచాయతీ రాజ్ ఫోరం అధ్యక్షులురాజుహాజరయ్యారు. మరియు కొల్లాపూర్ యూనిట్ సహ అధ్యక్షులు డీకే గణేష్ బాబు కోశాధికారి నాగరాజు యూనిట్ EC మెంబర్స్ శ్రీనివాసులు సుధాకర్ పాల్గొన్నారు.