కమాన్ పూర్ లో గడపగడపకు గ్యారంటీ కార్డుల పంపిణీ

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 13 : మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని ఓల్డ్ అంబేద్కర్ నగర్ లో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు గడప గడప తిరుగుతూ కాంగ్రెస్ గ్యారెంటీ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ గౌడ్ , ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కుక్క రవి, గ్రామ శాఖ అధ్యక్షుడు కొంతం శ్రీనివాస్, జిల్లా మైనార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సయ్యద్ ఇక్బాల్, అరెళ్ళి శ్రీనివాస్ , కాల్వ లింగయ్య చిప్పకుర్తి చంద్రయ్య, మంథని రామస్వామి, ఈదునూరి ఎల్లయ్య తదితరులు ఉన్నారు