Wednesday, 4 November 2026

కమాన్ పూర్ లో ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు

 

 

 

 

 

 

 

జనం సాక్షి , కమాన్ పూర్ : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మండల మహిళా అధ్యక్షురాలు పొన్నం రాజేశ్వరి ఆధ్వర్యంలో గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమాన్ పూర్ మండల ఎంపీపీ రాచకొండ లక్ష్మీ హాజరై మహిళ ప్రజాప్రతినిధులు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ చేశారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కమాన్ పూర్ మండల ఎంపీపీ రాచకొండ లక్ష్మి, కమాన్ పూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పొన్నం రాజేశ్వరి, సర్పంచులు నీలం సరిత, ఇటవేన కొమరమ్మ, ఆధివరహా స్వామి ఆలయ డైరెక్టర్ భూపెల్లి జ్యోతి లను కళాశాల విద్యార్థులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు శాలువాతో సన్మానించి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మిమల్లు, మండల కో ఆప్షన్ మెంబర్ ఎండి. ఇంతియాజ్, కమాన్ పూర్ గుండారం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నీల రాజయ్య, దండే కిషన్ నాయకులు నీలం శ్రీనివాస్, గడప కృష్ణమూర్తి, దండే కనకరత్నం, బోయిని బాలకృష్ణ, జంగపల్లి లక్ష్మణ్, గొడిశెల స్వామి, భూపెల్లి మల్లేష్, మెరుగు కుమార్, దామర సంపత్, గోష్కి వరప్రసాద్, సాన సురేష్, పవన్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.