జనం సాక్షి , మంథని : సహాయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు తూము రవీందర్ కుమారుడు డా” శ్రవణ్ – లక్ష్మీ ప్రసన్న కుమారుడు రుద్రాన్ష్ పుట్టినరోజు సందర్భంగా మంథని పట్టణం లోని ఇటీవల అనారోగ్యంతో మరణించిన బోయా రమేష్ కుటుంబం కు 25 కిలోల రైస్ బ్యాగ్, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు తూము రవీందర్, చైర్మన్ మేడగొని వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ బొడ్డు సతీష్, కార్యదర్శి బుద్ధర్తి సతీష్ కుమార్, కోశాధికారి కొమురోజు సురేష్, డైరెక్టర్ పనకంటి రాజేష్, సభ్యులు ఐతు డేవిడ్ పాల్గొన్నారు.




