ఏటూరునాగారం(జనం సాక్షి),మార్చి30.మండలంలోని ఎర్రల వాడకు చెందిన రామాటేంకి శ్రీనివాస్(25),అనే యువకుడు మద్యానికి బానిసై భార్యను వేధించేవాడు.ఈ వేధింపుల వల్ల భార్య వదిలేసి వెళ్ళిపోయింది.కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటూ నిత్యం మద్యం సేవిస్తూ మద్యం మత్తులో, అదే వీధిలో ఉంటున్న జాడి సంగీత అనే యువతిని నిన్ను ప్రేమిస్తున్న, పెండ్లి చేసుకుంటా అని వేధించే క్రమంలో పెద్దల సమక్షంలో మందలించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం తను జైలు కు వెళ్లి రావడం జరిగింది. ఐనా అతని లో మార్పు రాలేదు. మళ్ళీ మద్యం సేవించి బుధవారం రాత్రి సదరు యువతిని వేధించే క్రమంలో, గొడవ జరిగింది. దీనితో విసుగు చెందిన యవతి శ్రీనివాస్ చేతులు కట్టేసి కత్తితో పొడిచి చంపింది. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయం చెప్పి లొంగిపోయింది.
వేదిస్తున్న యువకుడిని చంపిన యువతీవేదిస్తున్న యువకుడిని చంపిన యువతీ




