కమాన్ పూర్ లో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం

జనంసాక్షి, కమాన్ పూర్ : రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదని, రైతులకు 3 గంటల విద్యుత్ చాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాక్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ , పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు బుధవారం కమాన్ పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మండలశాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచన విధానానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. కమాన్ పూర్ బస్ స్టాండ్ నుండి మూలమలుపు వరకు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మతో నినాదాలతో ర్యాలీ గా వెళ్లి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు