కమిషనర్ గారు ఇస్ నాట్ కరెక్ట్…
నెహ్రూ విగ్రహం పై దండల తొలగింపు. కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 14. (జనం సాక్షి). భారతదేశం హరి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణం లో నెహ్రూ విగ్రహం పై దండల తొలగించడం వట్ల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ తో వాగ్నివాదానికి దిగారు. సోమవారం పట్టణంలోని నెహ్రు పార్కులోని నెహ్రూ విగ్రహాన్ని శుభ్రం చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకులు గేటు దాటి బయటకు వెళ్లిన క్రమంలో మున్సిపల్ కమిషన్ సమ్మయ్య సిబ్బందితో వచ్చి దండలు తొలగించి మళ్లీ విగ్రహం శుభ్రం చేయించారు. పార్క్ బయట నుండి గమనించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని జాతీయ నాయకుడికి మీరిచ్చే గౌరవం ఇదేనా కమిషనర్ గారు ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అంటూ నిలదీయడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా విగ్రహం శుభ్రం చేస్తున్నారాని కమిషనర్ సమ్మయ్య చెప్పడంతో సమస్య సద్దుమంగింది.




