Thursday, 5 November 2026

వైద్యుల నిర్లక్ష్యంతో జంబిగి సర్పంచ్ మృతి.

వైద్యుల నిర్లక్ష్యంతో జంబిగి సర్పంచ్ మృతి.

 

రాయికోడు జనం సాక్షి. నవంబర్ 14. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ యువ సర్పంచ్ మృతి చెందిన హృదయ విదారక సంఘటన ఇది వివరాల్లోకి వెళితే మండలంలోని జంబిగి కే గ్రామ సర్పంచ్ తిరుమల పార్వతి నిండు గర్భవతి వయస్సు 25 సం. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఈనెల 12న మధ్యాహ్నం రాయికోడ్ లో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళింది అక్కడ సర్పంచ్ పార్వతి పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది అంతలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మరియు సిబ్బంది నిర్లక్షం కారణంగా ఆమెకు తీవ్ర రక్త స్రావం కావడంతో చేసేదేమి లేక చికిత్స నిమిత్తం జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించడంతో కుటుంబ సభ్యులు జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు దీంతో సర్పంచ్ పార్వతికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి పూర్తిగా విశమించడంతో రాత్రి 10 గంటల సమయంలో సర్పంచ్ పార్వతి మృతిచెందారు. పార్వతి కి భర్త శ్రీకాంత్ తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శ్రీకాంత్ ప్రస్తుతం టీవీ9 ఎలక్ట్రానిక్ మీడియాలో కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం జంభిగి కే గ్రామంలో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సర్పంచ్ పార్వతి అంత్యక్రియలలో పాల్గొన్నారు. ఆమె పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ భర్త శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ శ్రీకాంత్ కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. రైకోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ భార్య సర్పంచ్ పార్వతి మృతి చెందిందని శ్రీకాంత్ మరియు కుటుంబ సభ్యులు మృతురాలి తండ్రి రాములు ఎమ్మెల్యే ముందు బోరున విలపించారు. అందరితో మంచిగా ఉంటూ ప్రతి ఒక్కరికీ చిరునవ్వుతో పలకరిస్తూ ఉండే సర్పంచ్ పార్వతి మరణ వార్త తెలుసుకున్న గ్రామస్తులందరూ కన్నీరు మున్నిరయ్యారు. ఆమె మొదటి కూతురు మూడు సంవత్సరాల బిడ్డ ను, నిన్ననే జన్మించిన ఒకరోజు పాపను చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. అంత్యక్రియలలో జెడ్పిటిసి మల్లికార్జున్ పాటిల్, ఆత్మ కమిటీ అధ్యక్షులు సి విట్టల్, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సిద్ధన్న పాటిల్, ఎంపీపీ అధ్యక్షులు మమత అశోక్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బసవరాజ్ పటేల్, ప్రధాన కార్యదర్శి కె శంకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారుతి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఫోరం ఉపాధ్యక్షులు సంగమేశ్వర్ పాటిల్ లతోపాటు వివిధ గ్రామాల సర్పంచులు హనుమంతు, నాగార్జున యాదవ్, కిష్టయ్య, సతీష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ కేదార్నాథ్ పటేల్, మైపాల్ రెడ్డి, పి ఎస్ సి ఎస్ చైర్మన్ నాగిశెట్టి, ఎంపీటీసీలు మొగులప్ప, నిరంజన్ నాయకులు శివకుమార్, జ్ఞానేశ్వర్, అనిల్, రవీందర్, బసవరాజ్, కిష్టారెడ్డి ,నాజిమ్ పటేల్ లతోపాటు వివిధ శాఖల అధికారులు, పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, పలువురు టీవీ9 సంస్థలో పనిచేసే సిబ్బంది, గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.