మంచిర్యాల మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న సర్కిల్స్ పూర్తిగా నాసిరకంగా నిర్మాణాలు మరియు దాని లోపల చెట్లు పెరగడానికి రోడ్లు తవ్విన మట్టి నింపి కోట్లరూపాయలు దండుకుంటుంన్నారు. రోడ్డు వెడల్పు చెయ్యకుండా, ఆలోచన లేకుండా ముందు చూపు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీని వాళ్ళ వాహన దారులు యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయి.మంచిర్యాల టూ టౌన్లో 60 ఫీట్లకు బదులు బిఆర్ఎస్ నాయకునికి అనుకూలంగా 55 ఫీట్లకు కుదించడం జరిగింది. దీని మీద తక్షణం విచారణ చేపట్టాలి.బిఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలను నెలల తరబడి వాహన దారులకు ఇబ్బంది కలుగుతున్న పట్టించుకోవడం లేదు. దీని మీద టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పూర్తిగా అధికార పార్టీ కి మద్దతు తెలుపుతూ అధికార దుర్వినియోగం చేస్తున్నారన్నారు.గ్రంధాలయంలో కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు అక్కడి నిరుద్యోగులకు భోజన సదుపాయం ఏర్పాటు చేస్తే ఓర్వక గాంధి పార్కుకు తాళాలు వేసుకొని వెళ్లారు. దీని పై వివిరణ కోరగా పైనుండి ఒత్తిడి ఉందని పొంతనలేని సమాధానం చెప్తున్నారన్నారు.ఈ విదంగా పట్టణములో చాల సమస్యలు ఉన్నందున కమిషర్ పర్యటించి పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రామగిరి బాణేష్, మాజీ కౌన్సిలర్ పూదరి ప్రభాకర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్,పట్టణ ఉపాధ్యక్షులు జోగుల సదానందం, తదితరులు పాల్గొన్నారు.




