Thursday, 5 November 2026

సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

 

 

 

 

 

వీణవంక మే 15 (జనం సాక్షి ) వీణవంక గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సాహించడం తో పాటు వారిలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కప్ -2023 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వీణవంక మండలా కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల క్రీడ మైదానంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మక తీసుకున్న ప్రభుత్వం క్రీడల శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్ – 2023 మండల స్థాయి క్రీడా పోటీలను పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు.
వారు మాట్లాడుతూ . క్రీడలు ఈనెల 15 నుండి ప్రారంభమై 17వ తేదీ నాటి వరకు ముగుస్తాయని ముందుగా మండల స్థాయిలో మూడు రోజులపాటు అథ్లెటిక్స్‌. ఫుట్‌బాల్‌. కబడ్డీ. ఖో ఖో. వాలీబాల్‌ తదితర క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులు మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఆడే అవకాశం ఉంటుందని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మూసి పట్ల రేణుక తిరుపతిరెడ్డి. జెడ్పిటిసి మాడ వనమాల సాధవా రెడ్డి. సింగిల్ విండో అధ్యక్షులు మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి. మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కాసం వీరారెడ్డి. ఎంపీటీసీ నాగిడి సంజీవరెడ్డి. నాయకులు ముసిపట్ల తిరుపతిరెడ్డి. రాయిశెట్టి శ్రీనివాస్. స్థానిక తహసీల్దార్ రాజయ్య. ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ ఎంఈఓ విడపు శ్రీనివాస్. ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఉప సర్పంచ్ భానుచందర్ తో పాటు నాయకులు మధుసూదన్ రెడ్డి. రవీందర్ రావు. సంపత్ రెడ్డి. క్రీడాకారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.