కరుణగిరిలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా చీరలు, దుప్పట్లు పంపిణీ
ఖమ్మం అర్బన్, డిసెంబర్ 24(జనంసాక్షి) ఈరోజు కరుణగిరిలో కతోలిక భిషప్ ఉడుముల బాల ఆధ్వర్యంలో పేదలకు సుమారు 1000 మంది పైగా స్త్రీలకు, పురుషులకు క్రిస్మస్ సందర్భముగా చీరలు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా క్రీస్తు ప్రభువు నేర్పించిన కరుణ, దయ గుణాలు పెంపొందించుకోవాలని దీని ద్వారా మానవుల మధ్య శాంతి సమాధానాలు నెలకొల్పాలని అందరూ సోదర భావంతో మానవులందరూ కలిసిమెలిసి ఉండాలని బోధించినారు. ప్రపంచ శాంతికి మనం బాటలు వేయాలని, ఈ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, మానవుల మధ్య ఈర్ష ద్వేషాలు, పోవాలని ఆయన కోరారు. దీని ద్వారా అనేక దీవెనలు మనం పొందుకోవచ్చని. ఈ పండగ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అందాలని ఆయన ప్రభువుని ప్రార్థించారు.ఈ పంపిణీ కార్యక్రమంలో కరుణగిరి డైరెక్టర్ ఫాదర్ మాథ్యూ వరప్రసాద రాజు, ఫాదర్ సుధాకర్, ఫాదర్.విజయ్, సిస్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
కరుణగిరిలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా చీరలు, దుప్పట్లు పంపిణీ




