సిఓఈ విద్యార్థులకు ఐకార్ లో అడ్మిషన్స్
– అభినందించిన ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి.
ఫొటో : ఎంపికైన విద్యార్థులు.
బెల్లంపల్లి, డిసెంబర్ 24, (జనంసాక్షి )
తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఓఈ బెల్లంపల్లి కి చెందిన ఇద్దరు విద్యార్థులు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐకార్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్) లో అడ్మీషన్స్ సాధించినట్లు ప్రిన్సిపల్ ఐనాను సైదులు తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఐకార్ ఆగస్టు నెలలో నిర్వహించిన జాతీయస్థాయి ప్రవేశపరీక్షలో అత్యంత ప్రతిభ చూపిన రావుల మాదవన్ 239 ర్యాంకుతో యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్, బెంగుళూర్(కేరళ)లో బీఎస్సీ(హానర్స్)అగ్రికల్చర్ కోర్సులో అడ్మీషన్ సాధించాడు. చాపిడి అజయ్ 881 ర్యాంకుతో డా.రాజేంద్రప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, పూస (బీహార్) లో బిఎస్సీ(హానర్స్)హార్టికల్చర్ కోర్సులో అడ్మీషన్ సాధించాడు.
విద్యార్ధులకు ఆర్సీఓ అభినందన:-
బెల్లంపల్లి సిఓఈ విద్యార్ధులు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించడమే కాకుండా ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ యూనివర్సిటీలో సీట్లు సాధించి ఆదిలాబాద్ రీజియన్ సంక్షేమ గురుకులాల సత్తాచాటిన సిఓఈ విద్యార్ధులను ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి ప్రత్యేకంగా అభినందించారు. ప్రిన్సిపాల్ ఐనాల సైదులు, అధ్యాపకులు నాగిని శ్రీరామవర్మ, చందా లక్ష్మీనారాయణ, మిట్టా రమేష్, సురేష్ గౌడ్, సుంకరి అర్జున్, కట్ల రవీందర్, ఆకినేపల్లి రాజేష్, మహమద్ రఫీ, గాజుల రాజేందర్, అనుముల అనిరుద్, సజ్జనపు విజయ్, అవునూరి రవి విద్యార్ధులను అభినందించారు.





