కరెంటు వైర్లకు తాగి గడ్డి డీసీఎం దగ్ధం తృటిలో తప్పిన పెను ప్రమాదం
గంగారం డిసెంబర్ 30 (జనం సాక్షి)
గంగారం మండలం తిరుమలగండి గ్రామ పంచాయతీలో అగ్నికి ఆహుతి అయిన డిసిఎం వివరాల్లోకి వెళితే తిరుమలగండి గ్రామానికి వరిగడ్డిని పశువుల మేత కోసం ఇల్లందు నుంచి వచ్చిన రైతు గడ్డిని ఇక్కడి రైతుల నుండి కొనుగోలు చేసి లోడు చేశాక గ్రామం నుండి వెళ్తుండగా గ్రామంలోని కరెంటు వైర్లు తాకడంతో ఒక్కసారిగా మంటలు గడ్డికి అంటుకోవడం జరిగింది వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ హుటాహుటిన డీసీఎంని ఊరి చివరికి తీసుకెళ్లడంతో గ్రామస్తులందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనలో పూర్తిగా డీసీఎం దగ్ధం అయ్యింది




