Tuesday, 3 November 2026

బీఆర్ఎస్ నాయకులు ఎండీ కుతుబొద్దిన్ ఆధ్వర్యంలో అన్నదానం

బీఆర్ఎస్ నాయకులు ఎండీ కుతుబొద్దిన్ ఆధ్వర్యంలో అన్నదానం
జహీరాబాద్ డిసెంబర్ (జనంసాక్షి) మొగుడంపల్లి మండల కేంద్రములోనీ ఎక్స్ రోడ్ యూనియన్ బ్యాంక్ వద్ద స్వర్గీయ మాజీ మంత్రివర్యులు మహమ్మద్ ఫరీ దొద్దిన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మహమ్మద్ ఎండీ కుతుబొద్దిన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు,ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఎండీ కుతుబొద్దిన్ మాట్లాడుతూ.ఫరీ దొద్దిన్ సేవలను కొనియాడారు జహీరాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధి చేసిన ఘనత ఆయనదే అన్నారు, ఈ కార్య క్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు బీజీ సందీప్, మాజీ ఎంపీపీ చిరంజీవి ప్రసాద్, వివిధ గ్రామల సర్పంచులు, ఎంపీటీసీలు తదితులున్నారు