Tuesday, 3 November 2026

మంత్రికి బానిసల్ల ఎందుకు పనిచేస్తున్నారు

మంత్రికి బానిసల్ల ఎందుకు పనిచేస్తున్నారు..!

పద్మశాలి సంఘం నాయకులు నాగుల శ్రీనివాస్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. డిసెంబర్ 30. (జనంసాక్షి). పట్టణ పద్మశాలి సంఘం నాయకులు మంత్రి కి బానిసల్లా ఎందుకు పనిచేస్తున్నారని పద్మశాలి సంఘం నాయకులు నాగుల శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పరిచేయాల్సిన పద్మశాలి సంఘాన్ని బిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థగా మార్చడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పద్మశాలి యువజన సంఘానికి ఎన్నికలు జరిగి ఎన్నేళ్లు అవుతుందని ప్రశ్నించారు. మున్సిపల్. సేస్ ఎన్నికల్లో అధికార బి ఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడానికి తప్పు పట్టారు. పద్మశాలిల అభ్యున్నతికి అన్ని పార్టీల సహకారం అవసరమని స్పష్టం చేశారు. డిసెంబర్ 31 తో పట్టణ పద్మశాలి సంఘం కాల పరిమితి ముగుస్తుందని షెడ్యూల్ ప్రకారం తక్షణమే ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. సమావేశంలో గాజుల సదానందం, నరేష్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు