జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ గ్రామం మద్దూరి గట్టయ్య కు చెందిన ఎద్దు బుధవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృత్యువాత పడింది. మేతకు వెళ్లిన ఎద్దు చందనాపూర్ గంగాదేవి గుడి దగ్గర నీళ్ల కోసం వెళ్లి నీళ్లు తాగి ఒడ్డుకు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ కు తగిలి ఆ ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు విలువ సుమారు రూ. 50 వేలు ఉంటుందని, తాను నిరుపేద రైతునని ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తనకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు మద్దూరి గట్టయ్య ఈ సందర్భంగా వేడుకున్నారు.
కరెంట్ షాక్ తో ఎద్దు మృతి




