వలిగొండజనం సాక్షి న్యూస్ జూన్ 14 మండలంలోని సుంకిశాల గ్రామంలో గ్రామ దేవతలు పోచమ్మ తల్లికి కట్ట మైసమ్మ తల్లికి బోనాలను ఘనంగా నిర్వహించారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనాన్ని ఎత్తుకొని మహిళలు ఆలయాలకు బయల్దేరారు. అనంతరం అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింతల మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. గ్రామస్తులంతా పోచమ్మ తల్లి కట్ట మైసమ్మ తల్లి ఆలయాలకు చేరుకున్నారు. వర్షాలు బాగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లేలా చూడాలని బోనాల నైవేద్యాన్ని సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మొగిలిపాక నరసింహ, ఉపసర్పంచ్ మెట్టు కొండల్ రెడ్డి, నాయకులు ఫైళ్ల రాజవర్ధన్ రెడ్డి చెరుకు శివయ్య గౌడ్ ఈతాప రాములు ఫైళ్ల ఉపేందర్ రెడ్డి బొక్క బుచ్చిరెడ్డి చెరుకు జంగయ్య గౌడ్ కోలన్ మహేందర్ రెడ్డి కోమ్మగాని జంగయ్య గౌడ్ కౌడే కిష్టయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా పోచమ్మ తల్లికి కట్ట మైసమ్మ తల్లికి బోనాలు




