జనంసాక్షి, మంథని : ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా బుధవారం మంథని మాత శిశు ఆరోగ్య కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇప్పటి వరకు 47 సార్లు రక్త దానం చేసి ఆపద లో ఉండి రక్తం అవసరం ఉన్నవారికి మేము చేసిన సేవలను గుర్తించి మంథని మున్సిపల్ పరిధిలోని బోయిన్ పేటకు చెందిన పోతరవేణి క్రాంతి కుమార్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ జక్కు శ్రీహర్షిని చేతుల మీదుగా ప్రశంసపత్రం అందజేశారు.
ప్రశంసా పత్రం అందుకున్న క్రాంతి




