భైంసా రూరల్ జూన్14 జనం సాక్షినిర్మల్ జిల్లా బై0సా.
కరోనా మహమ్మారి నుంచి తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడిన ఘనత వైద్య రంగానికి దక్కిందని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం బై0సా పట్టణం లోని ఎన్.అర్ గార్డెన్ లో జరిగిన వైద్యారోగశాఖ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడారు…. విపత్కర పరిస్థితిలో వైద్య ఆరోగ్య వైద్య సిబ్బంది సేవలు మరిచిపోలేనివిగా ఘనతకెక్కాయని కొనియాడారు. న్యూట్రిషన్ కిట్స్,బీపీ ఆపరేటర్,సారీస్ ను అందించారు వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమములో నాయకులు, అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కరోనామహమ్మారి వేళా వైద్యరంగ సేవలు అద్భుతం.. వైద్యారోగ్య ఉత్సవాలలో – పాల్గొన్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి.




