Wednesday, 4 November 2026

ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వైద్యరంగం అభివృద్ధి  ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ఇవ్వడం ఆనంద్ దాయకం

 

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి,  జూన్ 14 : -ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వైద్యరంగం అభివృద్ధి చెందిందని, అలాగే ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ఇవ్వడం ఆనంద్ దాయకం అని డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అన్నారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్డు పిఎస్ఆర్ గార్డెన్లోని వైద్య ఆరోగ్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పట్నం మాణిక్యం మాట్లాడుతూ ప్రజలకు అన్ని విధాలుగా  తెలంగాణ ప్రభుత్వం సహకరించడమే కాకుండా వైద్య రంగంలో మహా అద్భుతాలను సృష్టిస్తుందన్నారు. మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో జిల్లా ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వాసుపత్రుల్లో నేడు డాక్టర్ మంచి సేవలు అందిస్తూ ప్రజల మందలను పొందాలని డాక్టర్ సూచించారు. గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు అందించడం ఎంతో ఆనందదాయకమన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి శరత్మా, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్,  సి డి సి చైర్మన్ బుచ్చి రెడ్డి గారు,మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి గారు మరియు ఎంపీటీసీలు,జడ్పిటిసిలు,సంబంధిత అధికారులు,బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.