కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు

]కరోనాను విపత్తుగా ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ,మార్చి 14(జనంసాక్షి): యావత్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) కేసులు భారత్ లో కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండంతో.. కరోనా వైరసను కేంద్ర ప్రభుత్వం విప త్తుగా ప్రకటించింది. రాష్ట్ర విపత్తు సహాయనిధి కింద సహాయం అందిం చేందుకు వీలుగా కోవిడ్-19ను విపత్తుగా పరిగణించాలని ప్రభుత్వం నిం యించిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్కో మృతుడి కుటుం బానికి రూ. 4లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం భారత్ లో 83 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి 145 దేశా లకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా 5423 మంది కరోనా కారణంతో మృతి చెందారు. మరోవైపు, కరోనా కేసులు పెరుగుతున్నందున అప్రమ త్తమైన రాష్ట్రాలు కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాయి. చాలా రాష్ట్రాలు పాఠశాలు, కళాశాలలకు సెలవులు ప్రకటించాయి. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లను మూసివేశాయి. ఇది ఇలావుంటే, కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. దేశవ్యాప్తంగా అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా వైరసన్ను భారత ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. రాష్ట్ర విపత్తు సహాయనిధి కింద సహాయం అందించేందుకు వీలుగా కోవిడ్-19ను విపత్తుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్రం హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 4లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కాగా, కర్ణాటకలోని కలబుర్గి, ఢిల్లీలో కరోనాతో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. భారత్ లో ప్రస్తుతం 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా 5 వేలకు పైగా బాధితులు మరణించగా.. 1,45, 810 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కోవిడ్ భయాల నేపథ్యంలో అప్రమత్తమైన పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాయి. ఢిల్లీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు పాఠశాలు, – కరోనాను విపత్తుగా ప్రకటించిన కేంద్రం కళాశాలలకు మార్చి 31 వరకు సెలవులు ప్రకటించాయి… షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లను మూసివేశాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నెల ఆఖరు వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. —

తాజావార్తలు