Thursday, 5 November 2026

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం చరిత్రాత్మకం

 

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మతతత్వ బిజెపి పార్టీని మట్టి కరిపించి, కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించి ప్రభుత్వ ఏర్పాటు చేయబోతున్నందున రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర రావు హర్షం వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుపట్ల వ్యక్తం చేస్తూ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడళ్ళ వద్ద పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచిపెట్టారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సత్ఫలితాలను ఇస్తుందని, మొదటగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో, నేడు కర్నాటక రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీతో గెలిచిందనీ, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తరహా ఫలితాలు రావడం ఖాయమన్నారు. సీఎం కెసిఆర్ ను అధికారం నుండి దించి కాంగ్రెస్ విజయదుంధుబి మోగించడం ఖాయమన్నారు. ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం ఉన్న కాంగ్రెస్ పార్టీకి కర్నాటక ప్రజలు బ్రహ్మరథం పట్టారని, అందుకు కర్నాటక ప్రజలకు, ఎన్నికల్లో కష్టపడి పని చేసి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించిన కర్నాటక కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ అభినందనలు తెలిపారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కర్నాటక రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా
పని చేసిన విధానాన్ని ఆదర్శంగా తీసుకుని కష్టపడి పనిచేసి రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వాన్ని, కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలీ, జిల్లా కాంగ్రెస్, యువజన అధ్యక్షుడు బైరు శైలేందర్, కాంగ్రెస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, సేవాదళ్ విభాగం ఆర్గనైజర్ ఆలేటి మాణిక్యం, ఎన్ఎస్ యుఐ నియోజకవర్గ అధ్యక్షుడు బందం విష్ణు, జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సాయి నేత , సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ ఖమ్మంపాటి మధు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.