Thursday, 5 November 2026

బిచ్కుంద షాదీఖానా కోసం మౌనమేలనోయి కోఆప్షన్

 

 

 

 

 

 

బిచ్కుంద మే (జనంసాక్షి)గ్రామ పెద్దలు కీర్తిశేషులు డాక్టర్ అలీ తనయుడు, కీర్తిశేషులు నాల్చర్ శ్రీహరి తనయుడు మరియు తదితర పెద్దలతో చర్చించి షాదీఖానా వాడకానికి తేవాలని ప్రజలు మండల కోఆప్షన్ ను హితవు పలుకుతున్నారు. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల ముస్లిం షాదీఖానా మరమ్మతులకు నిధులు కేటాయించాలని బిచ్కుంద మండల వాసులు కోరుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు అమలు చేయడానికి ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధికి బాటలు వేస్తున్న తరుణంలో మండల కోఆప్షన్ ప్రభుత్వ దృష్టికి తీసుకళ్లకపోవడంతో జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తతో కలసి రూటు మార్చుతున్నట్లు సమాచారం. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సానుకూలంగా ఉన్నా సదరు కోఆప్షన్ అడగకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మండలంలో వేల మంది ముస్లిం జనాభా ఉన్నారని, గత 15 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ షాదిఖానా భవనానికి సరైన గోడ లేదని, అదేవిధంగా డైనింగ్ హాల్, కిచెన్ రూమ్ లో కరెంట్ మీటర్ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టూ ముళ్ళ పొదలు పెరిగి చెత్తా, చెదారం తయారైందని, వాటిని శుభ్రంగా చేయించాల్సి ఉంటుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా పట్టించుకొని, ఈ భవనం మరమ్మతులకు నిధులు కేటాయించడంతో పాటు షాదిఖానా భవనంలోని సమస్యలను పరిష్కరించాలని మండల ముస్లిం సోదరులు కోరుతున్నారని వారు తెలిపారు.