Thursday, 5 November 2026

కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు విజయోత్స ర్యాలీ. డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి

 

 

 

 

 

 

 

 

భువనగిరి టౌన్ (జనం సాక్షి):— యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రలోని కర్ణాటక రాష్ట్రంలో సార్వతిక అసెంబ్లీ ఎలక్షన్లో లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణం మండల నాయకులతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలతో నాయకులతో ఆనందోత్సవం తో కుంభం అనిల్ కుమార్ రెడ్డి సీట్లు పంచి హర్ష వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నూతన ఉత్సాహంతో డాన్సులు చేస్తూ బాణాసంచా కాల్చుతూ ర్యాలీ తో నిర్వహించారు .
ఈ సందర్భంగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అద్భుతమైన విజయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మరియు ఖర్గే చరిష్మా ముఖ్య పాత్ర పోషించిందని ఇదే స్ఫూర్తి తో దేశంలో త్వరలో జరిగే 4 రాష్ట్ర ఎన్నికలు ముఖ్యంగా తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ గెలువబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ 12 నియోజవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నారు .యాదాద్రి భువనగిరి జిల్లాలో బోనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని అన్నారు. మున్ముందు కూడా దేశంలో ఇక బీజేపీ పార్టీకి చరమ గీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ గెలుపు ఒక్క కాంగ్రెస్ పార్టీది కాదని కర్ణాటక ప్రజలదని గుర్తు చేస్తూ ఒకానొక దశలో ఎప్పటిలాగే బీజేపీ అగ్ర నాయకత్వం మత బాణాన్ని వదిలిన ,స్వయంగా అమిత్ షా , నడ్డాలు బెదిరించిన మోడీ ముసలి కన్నీరు కారుస్తూ రోడ్ షో లు చేసిన కూడా కర్ణాటక ప్రజలు అదరక , బెదరక , విజ్ఞతతో & ఓర్పుతో తమ ఓటు ద్వారా బీజేపీ కి సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్పారని తెలంగాణలో కూడా బిజెపికి అంట కాగుతున్న కెసిఆర్ అవినీతి పాలనను కూడా ఇక్కడ ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ మెంబర్ తంగడపల్లి రవికుమార్ ,పోతునకు ప్రమోద్ కుమార్ ,మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రేజహంగీర్ బిసు కుంట్ల సత్యనారాయణ కౌన్సిలర్లు పచ్చళ్ల హేమలత జగన్ వడిచర్ల లక్ష్మి కృష్ణ యాదవ్ ఇరపాక నరసింహ పడగల రేణుక ప్రదీప్ కైరం కొండ వెంకటేష్, డిసిసి కార్యదర్శి నక్కల ఆదినారాయణ బేండ లాల్ రాజ్ ,చల్లగురుగుల రఘుబాబు ,పిట్టల బాలరాజ్ ,గుర్రాల శ్రీనివాస్ , బేండే శ్రీకాంత్ ,,కూర వెంకటేష్, గ్యాస్ చిన్న ఎండి బబ్లు తాహెర్ మజహర్ గాజుల కుమార్ యూత్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బర్రె నరేష్, ఎన్ఎస్ఎ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ యూత్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట గిరీష్, యూత్ అధ్యక్షుడు అవే జ్ చిస్తీ ,ముత్యాల మనోజ్ ,కొల్లూరు రాజు, అందే నరేష్ కాకునూరు మహేందర్ మండల్ నాయకులు కోట స్వామి ,శివకుమార్ గుమ్మి డల ,రమేష్ ,నాగయ్య చిక్కుల వెంకటేష్ ,శివానంద్ ,జంగయ్య ,వీరయ్య,
తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.